జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కోడిమ్యల కేంద్రంలో జిల్లా పోలీస్, కేంద్ర బలగాలతో కలసి ఫ్లాగ్ మార్చ్ వంటి కవాతును అడిషనల్ ఎస్పీ శ్రీ భీమ్ రావు గారు జెండా ఊపి ప్రారంబించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుతూ. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని అన్నారు.
ఎలక్షన్ కమిషన్ సూచించిన గైడ్లైన్స్ ప్రకారం పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తారని తెలియజేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలకు భరోసా కల్పించడంలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా,గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసారు. అక్రమ మద్యం,నగదు రవాణాకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఫ్లాగ్ మార్చ్ లో డిఎస్పీ రఘు చందర్,CISF అదికారులు, సీ.ఐ రవి,మరియు ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది,CISF సిబ్బంది పాల్గొన్నారు.