హైదరాబాద్ జిల్లా: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మరియు పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో రెండు ముఠాలను అరెస్ట్ చేసి 130 గ్రాముల MDMA, 10 LSD బ్లాట్స్, 4 మొబైల్స్ సీజ్ చెయ్యడం జరిగింది.ఈ రెండు కేసుల్లో మాదకద్రవ్యాల సరఫరాదారులు మరియు పెడ్లర్లు డ్రగ్స్ వినియోగించే వారి నుండి మ్యూల్ ఖాతాల ద్వారా చెల్లింపులు స్వీకరిస్తూ వర్చువల్ నంబర్ల ద్వారా కమ్యూనికేట్ చేసేవారు. పోలీసులకి దొరకకుండా ఉండేందుకు డెడ్ డ్రాప్స్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేశారు.H-NEW మరింత బలోపేతం కావడంతో రానున్న రోజుల్లో మాదకద్రవ్య ముఠాలు మరియు వారి నెట్వర్కులపై మరిన్ని దాడులు జరగనున్నాయి అని ఐపీఎస్ సీవీ ఆనంద్ తెలిపారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.