విచారణహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. నాగోల్కు చెందిన హరిందర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సులో రద్దీ పెరిగిందని, కుటుంబంతో వెళ్తే బస్సుల్లో కనీసం నిలబడే పరిస్థితి కూడా లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ జారీ చేసిన జీవో 47ను రద్దు చేయాలి. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఈ వ్యాజ్యం లేదు. ఇబ్బంది ఎదుర్కోవడం వల్లే పిటిషన్ దాఖలు చేశారు. పిల్ను రిట్ పిటిషన్‌గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది.
News from our Telangana Citizen Reporter
SANJEEV RAJESHAM BHANDARI