రాచకొండ జిల్లా: నాగోల్ పట్టణంలోని బ్లైండ్స్ కాలనిలో ఒక ఇంటి నుండి దుర్వాసన వస్తుందని ఇరుగుపొరుగువారు డయల్ 100 కు కాల్ చేసి కంప్లయింట్ చేశారు.వెంటనే స్పందించిన SHO సూర్య నాయక్ తన బృందంతో ఆ ఇంటికి వెళ్లి చూసే సరికి వృద్ధ దంపతులు కొద్దిపాటి స్పృహలో ఉన్నట్లు గుర్తించారు. వారితోపాటు వారి చిన్న కుమారుడు నాలుగు రోజుల క్రితమే చనిపోయి శరీరం నుండి కుళ్ళు వాసన రావటం చూశారు.దంపతులు గుడ్డి వాళ్లుకావడంతో తమ కుమారుని మరణం గురించి తెలియకుండానే నాలుగు రోజులుగా శవంతోనే ఉంటున్నారు. పోలీసులు ఆ జంటను రక్షించి వెంటనే ఆహారం అందించారు. విషయాన్ని వారి పెద్ద కుమారుడికి తెలిపి ఆ వృద్ధ దంపతులను అతని రక్షణలో ఉంచారు.పోలీసు బృందం స్పందించిన తీరుతో ఒక వృద్ధ జంట ప్రాణాలు మిగిలాయి.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.