జగిత్యాల జిల్లా :-జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామానికి చెందిన అన్నపు నేను విద్యాసాగర్ రాజు s/o రాజు రమేష్ రాజు తన తమ్ముడైన నన్న పనే విక్రమ్ రాజు s/oరమేష్ రాజు తేదీ 01.10.2024 రోజున సాయంత్రం 05.30 గంటలకు, అనునతడు భూమి తగాదాలు మనసులో పెట్టుకొని రోకలి బండతో విచక్షణరహితంగా తల మీద కొట్టగా, మృతుడైన విద్యాసాగర్ రాజు తలకు తీవ్ర గాయాలు అక్కడికక్కడే చనిపోయినాడు. ఇట్టి విషయంలో నన్నపనేని విక్రమ్ రాజు మీద తేది 01.10.2024 రోజున కేసు నమోదు అయింది. ఇట్టి కేసు లో నిందితుని ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా తేదీ 02.10.2024 రోజున మధ్యాహ్నాం సమయం దాదాపు 1.50 గంటలకు నిందితుడైన విక్రమ్ రాజు ను అంతర్గాం గ్రామ శివారులో జగిత్యాల రూరల్ సిఐ గారు అయిన వై కృష్ణారెడ్డి గారు సిబ్బందితో యుక్తంగా వెళ్లి నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసి అతడు తన ఇంటి వద్ద దాచిపెట్టిన రోకలి బండ ను స్వాధీనం చేసుకోనైనది. ఈరోజు తేది 03.10.2024 రోజున నిందితున్ని గౌరవ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జగిత్యాల నందు హాజరు పరిచి, రిమాండ్ కు తరలించడమైనది. ఇట్టి కేసులో దర్యాప్తు చేపట్టి నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న, సీ ఐ గారు ,పిఎస్ ఎస్ఐ గారైన ఎన్.సధాకర్ గారిని జగిత్యాల డిఎస్పి గారు డి. రఘుచందర్ గారు అభినందించారు.
Our Telangana Citizen Repoter.
A. Naveen Kumar.