
జగిత్యాల జిల్లా: గొల్లపల్లి మండల్ గుంజపడుగు కు చెందిన పురాణం స్పందన (6) అనే 1వ తరగతి చదువుతున్న చిన్నారి ఆటోలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఆటో డోర్ ఊడిపోవడంతో కింద పడింది. చిన్నారిని హుటాహుటిన జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు తెలిపారు.చిన్నారి మృతితో ఆమె తల్లితండ్రులు శోకంలో మునిగారు బంధువులు దుఃఖంలో ఉన్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. చిన్నారి తల్లితండ్రుల కంప్లయింట్ మేరకు గొల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.ఈ సంఘటనతో ఆ చిన్నారి ఊరంతా శోక ఛాయలు కమ్ముకున్నాయి. పిల్లల్ని స్కూలుకు పంపిన తల్లితండ్రులు భయాందోళనలకు గురి అవుతున్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.