నేరేడ్మెట్లోని కమిషనర్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, నమోదు చేయాల్సిన సెక్షన్లు, విచారణ పద్ధతుల్లో ఆయా స్టేషన్ల సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల నమోదులో అనుసరించాల్సిన వివిధ సెక్షన్ల నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ చంద్రమోహన్, ఏసీపీ వెంకటేశం, ఏసీపీ నరేందర్ గౌడ్, సీసీఆర్బీ ఏసీపీ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆశిష్‌రెడ్డి, అడ్వకేట్ అశ్విన్‌రెడ్డి, వివిధ స్టేషన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.