***మొబైల్ ఫోన్ పోయిన చోరీకి గురైన www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి.
***సెల్ఫోన్లో రికవరీ కోసం ప్రత్యేకత ఏర్పాటు.
***జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 41 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.
జగిత్యాల: జిల్లాల ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మొబైల్ ఫోన్ల రికవరీ కోసం జిల్లాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరం పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 411 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందనీ, ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన వెంటనే CEIR పోర్టల్ (https://www.ceir.gov.in) నందు బ్లాక్ చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు పోయిన లేదా చివరికి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్లో ఎంతో ఉపయోగపడుతుందని CEIR వెబ్సైట్లో వినియోగదారులు వివరాలు నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించమన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అసభ్య చేస్తే ఫోన్లో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తుందన్నారు. ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. అదేవిధంగా ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనే ముందు అప్లికేషన్లు అట్టి ఫోన్ యొక్క వివరాలు అనగా నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా ఎవరైనా సెల్ ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు.
Our Telangana Citizens Reporter.
Shivacharan Chippa