ఎన్నికల నియమావళి అమలులో భాగంగా కోదాడ, సూర్యాపేట పట్టణ కేంద్రాల్లో లాడ్జి ల నందు తనిఖీలు నిర్వహించడం జరిగినది. కొత్త వ్యక్తుల ఆశ్రయం, అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ రవాణా నివారణ కోసం తనిఖీలు చేయడం జరిగినది. సూర్యాపేట పట్టణంలో సీతారాంపురం కాలనీలో ఒక ఇంట్లో 85 వేల రూపాయల విలువగల మద్యం సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మండల కేంద్రంలో గల ఆదర్శ్ కాలనీ నందు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగినది. ఎన్నికల నిర్వహణకు ప్రజల భద్రత మరియు రక్షణలో భాగంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు సమస్యాత్మక ప్రాంతాల్లో రైడ్ లు కార్డన్ అండ్ సెర్చ్ లు నిర్వహిస్తున్నాం అని DSP రవి తెలిపినారు. సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేయడం జరిగినది. ఎన్నికల నియమావళి పై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది.