సిద్దిపేట జిల్లాలో భరోసా సెంటర్ ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తయినందున ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్., మేడమ్ గారు ఈరోజు భరోసా సెంటర్లో కేక్ కట్ చేసి భరోసా సెంటర్ సిబ్బందిని అభినందించి ఘనంగా సన్మానించారు బాధిత మహిళలకు బాలికలకు అండగా సేవలు అందిస్తున్న సిద్దిపేట భరోసా సెంటర్
ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మేడమ్ గారు మాట్లాడుతూ* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు భరోసా సెంటర్లో బాధ్యత మహిళలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని తెలిపారు. భరోసా కేంద్రంలో లైంగిక దాడులకు గురైన బాధితులకు బరోస కల్పిండంతో పాటు వారికి పూర్తి సహయ సహకారాలను అందిస్తుందని తెలిపారు, భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించడం జరుగుతుందన్నారు. మరియు జిల్లాలో ఎక్కడైనా పోక్సో మరియు అత్యాచారం కేసులు జరగగానే సంబంధిత బాధితులను నేరుగా భరోసా సెంటర్ కు సంబంధిత అధికారులు తీసుకొని రాగానే చట్ట ప్రకారం వారికి అందించవలసిన సూచనలు సలహాలు తక్షణమే అందించడం జరుగుతుందన్నారు. మరియు కేసు కోర్టు ట్రాయల్ సమయంలో చట్ట ప్రకారం వారికీ కావలసిన సహాయ సహకారాలు న్యాయపరంగా సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు,
పోక్సో మరియు అత్యాచార కేసుల్లో బాధితులకు త్వరగా కాంపెన్సేషన్ ఇప్పించడానికి వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది కృషి కృషి చేయడం జరుగుతుందన్నారు. భరోసా సెంటర్ సేవల గురించి సంబంధిత బాధితులు భరోసా సెంటర్ నెంబర్ 08457-293098, డయల్ 100, నెంబర్ కు ఫోన్ చేసి సహాయ సహకారాలు పొందవచ్చని సూచించారు.
భరోసా కేంద్రంలో మహిళలకు పిల్లలకు భరోసా ఇచ్చిన కేసుల వివరాలు
- ఫోక్సో కేసులు-174
- రేప్ కేసులు -40
- ఇతర కేసులు- 09,
- మొత్తం 223 మంది బాధితులకు భరోసా కల్పించడం జరిగింది.
- భరోసా సెంటర్ సిబ్బంది 86 మంది బాధితుల ఇండ్లను సందర్శించడం జరిగింది,
- 19 మందిని రియాబిటేషన్ సెంటర్ కు పంపించడం జరిగింది.
- గ్రామాలలో పట్టణాలలో భరోసా సెంటర్ అందిస్తున్న సేవల గురించి 90 అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
- భరోసా సెంటర్ ఫండ్ నుండి 12 మంది బాధితులకు ఆర్థిక సాయం అందించడం జరిగింది.
- 2015 ఈరోజు వరకు బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి 223 మంది మహిళలకు 87,27,500/- ఆర్థిక సాయం అందించడం జరిగింది. ప్రాసిక్యూషన్ సమయంలో కూడా బాధితులకు న్యాయపరమైన సలహాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కేసులు నమోదవుతున్న పోలీస్ స్టేషన్ల నుండి సంబంధిత కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు ఎలాంటి జాప్యం లేకుండా భరోసా సెంటర్ కు పంపించాలని అధికారులకు సూచించారు.
మహిళా పోలీస్ స్టేషన్, భరోసా సెంటర్, మహిళా సహాయ కేంద్రానికి వచ్చిన మహిళల యొక్క సాధక బాధకాలు విని వారి యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీసి స్వయం ఉపాధి గురించి ఆసక్తి చూపే మహిళలను కుట్టుమిషిని, ఎంబ్రాయిడర్, స్వెట్ ఆధ్వర్యంలో 16 మహిళలకు శిక్షణ ఇప్పించడం జరిగింది. మరియు స్వయం ఉపాధికి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు అందించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీబీ మధు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏ.బి. దుర్గ, రూరల్ సీఐ శ్రీను, భరోసా సెంటర్ సిబ్బంది వినోద, సౌమ్య, హరిత, రేణుక, భవాని, స్వాతి, మహిళ హోంగార్డులు నవనీత, అనుష, తదితరులు పాల్గొన్నారు