జయశంకర్-భూపాలపల్లి జిల్లా: కేసు మిస్టరీని పోలీసులు చేదించినిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భూ వివాదాలే రాజలింగమూర్తి హత్యకు కారణంగా నిర్ధారించామన్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
హత్య కేసులో ఏడుగురు అరెస్ట్..
మీడియా సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి.. నిందితుల పేర్లు వెల్లడించారు.
ఏ1) రేణికుంట్ల సంజీవ్ (36), ఏ2) పింగిలి సీమంత్ (22), ఏ3) మోరె కుమార్ (35), ఏ4) కొత్తూరి కుమార్ (38), ఏ5) రేణికుంట్ల కొమురయ్య (60), ఏ6) దాసరపు కృష్ణ (45), ఏ7) రేణికుంట్ల సాంబయ్య (56).
పరారీలో ఉన్న నిందితులు…
ఏ8 కొత్త హరిబాబు – మాజీ వైస్ చైర్మన్ (బీఆర్ఎస్), ఏ9 పుల్ల నరేష్ తదితరులు.. వారి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి 2 కత్తులు, 2 రాడ్లు , 5 బైక్‌లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నలుగురు కలిసి హత్య చేయగా.. ఇద్దరు రెక్కీలో పాల్గొన్నారని.. మిగతా వారు వాళ్ళతో అటాచ్‌లో ఉన్నారన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.