రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని కమిషనర్ శ్రీ సుధీర్ బాబు IPS తెలిపారు. ఈరోజు బండ్లగూడలోని GSI ఆడిటోరియంలో NDPS కేసులపై విధానపరమైన సదస్సు మరియు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ మరియు ఉన్నత స్థాయి అధికారులకు నిషేధిత డ్రగ్స్ కేసుల దర్యాప్తులో సహాయపడే హ్యాండ్ బుక్ మాన్యువల్‌ను అందించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ నిషేధిత మందుల వాడకం సమాజంలో చీడపురుగులాంటిదని, డ్రగ్స్ వాడకాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాల రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద నిత్యం తనిఖీలతో పాటు ప్రత్యేక ఎస్ఓటీ బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టి గంజాయి, నల్లమందు, హెరాయిన్, ఇతర నిషేధిత డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై పలు కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాలను అరికట్టాలని, వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని సూచించారు.
కమీషనర్ మాట్లాడుతూ.. తెలియకుండానే డ్రగ్స్ బారిన పడి యువత బంగారు భవిష్యత్తు నాశనమవుతోందని, డ్రగ్స్ వల్ల యువత శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ధ్వంసం చేస్తున్నారన్నారు. విద్యార్థులు నిషేధిత డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు ఆకర్షితులవవద్దని సూచించారు. మాదక ద్రవ్యాల రవాణాపై పలు దాడులు నిర్వహిస్తున్నామని, పలువురిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీపీ తెలిపారు. యువతలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు కళాశాలల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డిసిపి డి.జానకి ఐపిఎస్, మహేశ్వరం డిసిపి శ్రీనివాస్ ఐపిఎస్, ఎస్టీ డిసిపి గిరిధర్ ఐపిఎస్, ఎల్బి నగర్ డిసిపి సాయి కెజి డిసిపి మురళీధర్ మరియు ఇతర ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సమాజంలో డ్రగ్స్‌కు స్థానం లేదు. : సీపీ సుధీర్ బాబు IPS యువత డ్రగ్స్ వాడకం మానుకోవాలి