రాష్ట్ర వ్యాప్తంగా 23 ఏండ్లుగా సమగ్ర శిక్ష విధులు నిర్వహిస్తున్న వివిధ రకాల సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర CPS ఉద్యోగుల జగిత్యాల అధ్యక్షులు గంగాధరి మహేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని, అన్ని రకాల సెలవులు ఇవ్వాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని, సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.జగిత్యాల జిల్లా తహసిల్ చౌరస్తా వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తు న్న సమ్మె శిబిరాన్ని శనివారము సందర్శించి జగిత్యాల జిల్లా అద్యక్షులు గంగాధరి మహేష్, ప్రధాన కార్యదర్శి సర్వ సతీష్, కోశాధికారి గొల్లపల్లి మహేష్ గౌడ్ లు మాట్లాడుతూ. శ్రమ దోపిడికి గురి అవుతు న్న వీరికి సెలవులు మంజూరు చేయాలని, ఉద్యోగ భద్ర త కల్పించాలని, మినిమం టైం స్కేల్ వర్తింప జేయాలని, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సిబ్బంది సేవలను క్రమబద్దీ కరించాలని, కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రతా కల్పించాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని, అన్ని రకాల సెలవులు వర్తింపజేయాలని TSCPSEU జగిత్యాల జిల్లా పక్షాన డిమాండ్ చేశారు.ప్రతి సమగ్ర శిక్ష ఉద్యోగికి జీవిత బీమా, ఆరోగ్య భీమా మ సౌకర్యం కల్పించాలన్నారు. రిటర్మెంట్ అయిన వారికి రిటర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మ్యాన పవన్,CPS సంఘం జిల్లా బాధ్యులు జనార్థన్, బోగ శ్రీనివాస్, వంశీ, శ్రీనివాస్, కిరణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.