జగిత్యాల జిల్లా : బుగ్గారం మండలం లో ప్రధాన రోడ్డు గుంతల మయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కరంగా మారగా పోలీసులు శ్రమ దానం చేసి ఆదివారం లోతైన గుంతలను పూడ్చి ఇబ్బందులు తొలగించారు. సుమారు రెండు కిలోమీటర్ల మేరకు లోతైన గుంతలు, వర్షానికి నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉండేది. పరిస్థితులను గమనించిన బుగ్గారం ఎస్సై శ్రీదర్ రెడ్డి ట్రాక్టర్ లతో మొరం పోయించి స్వయంగా శ్రమదానం చేసి గుంతలు పూడ్చి చదును చేశారు. ఎస్సై మాడ శ్రీదర్ రెడ్డి తన ఉదార స్వభావంతో స్పందించి తన సొంత డబ్బులతో అప్పటికప్పుడు కంకర చిప్స్, డస్ట్ కూడా తెప్పించి వర్షాలకు, నీటి నిలువలకు ఎలాంటి తావు లేకుండా, రోడ్డు బాగుండేలా గుంతలు పూడ్చిన మొరంపై చిప్స్ – డస్ట్ కలిపి పోసి లేవలింగ్ చేయించారు. ధర్మపురి సి. ఐ. ఎ.రామ్ నరసింహరెడ్డి ప్రత్యక్షంగా ఈ శ్రమదానం లో పాల్గొని పర్యవేక్షించారు. పలు సూచనలు, సలహాలు అందజేశారు. పోలీసుల శ్రమ దానం – వారి సేవా భావం చూసి మండల వాసులు, వాహన దారులు, బాటసారులు పోలీసులను ఎంతగానో మెచ్చుకున్నారు. శబ్బాష్ పోలీస్ అంటూ కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాపురెడ్డి,బుగ్గారం హెడ్ కానిస్టేబుల్ పులి రవి కుమార్ గౌడ్, కానిస్టేబుల్ వి.వెంకటేష్ గౌడ్, చంద్ర శేఖర్, సాజిద్, స్వామి, మండల అభివృద్ధి కమిటి కన్వీనర్ అయిన విడిసి కోర్ కమిటీ చైర్మన్ చుక్క గంగారెడ్డి, మాజీ సర్పంచ్ ల ఫోరం నాయకులు ఎన్నం కిషన్ రెడ్డి, ఆకుల రాజన్న, గౌరీ శంకర్, గంగాపూర్ మల్లేశం, దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Our Telangana Citizens Reporter.
Mr. Shivacharan Chippa.