పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా అక్రమ డబ్బు, మద్యం, విలువైన వస్తువులు, డ్రగ్స్ లాంటి అక్రమ రవాణాను నిరోధించడం లో భాగంగా జిల్లా పోలీసు అంతరాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల వెంట ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి రౌండ్ ది క్లాక్ పటిష్టంగా వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 65 హైదరాబాద్ – విజయవాడ హైవే పై టేకుమట్ల వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా సరిహద్దు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ నివారణలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు నార్కోటిక్ డాగ్ రోలెక్స్ తో వాహనాల తనిఖీ లు నిర్వహించడం జరిగినది. ఈ రోలెక్స్ డాగ్ నార్కోటిక్ డ్రగ్స్ ను గుర్తించడంలో నైపుణ్యం కలిగినది. గతంలో అల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ నందు ప్రతిభ చూపి నార్కోటిక్ విభాగంలో డాగ్ రోలెక్స్ బహుమతి పొందినది.
ఈ తనిఖీల్లో చెక్ పోస్ట్ సిబ్బంది, డాగ్ హ్యండిలర్ ఉన్నారు.