లోక్ సభ ఎన్నికల సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడం గారి ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా సిఐలు, ఎస్ఐలు సిబ్బంది, కేంద్ర బలగాలతో కలిసి విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50 వేల కంటే ఎక్కువ డబ్బులు వెంట తీసుకుని వెళ్లకూడదని సూచించారు. ఎవరైనా అత్యవసరంగా డబ్బులు తీసుకొని వెళితే సంబంధిత ఆధారాలు తప్పకుండా వెంబడి ఉంచుకోవాలని సూచించారు. వాహనాల తనిఖీ నిర్వహించేటప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాహనదారులు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా డబ్బులు, ఇతర గిఫ్ట్ ఆర్టికల్స్, లిక్కర్ అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.