ఎస్,టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం, నగరంలో వివిధ వి.వి.ఐ.పి./వి.ఐ.పి. కార్యక్రమాలు, దసరా, దీపావళి బందోబస్తులు, నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు, మహిళలు, చిన్న పిల్లలపై నేరాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు, సైబర్ నేరాలు, గంజాయి అక్రమ రవాణా అరికట్టడం, చేడు నడత కలిగిన వారిపై నగర బహిష్కరణలు, అలవాటు పడిన నేరస్తులపై పి.డి.యాక్ట్ లు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, మరియు ధర్నాలు, రాస్తారోకోలు మొదలగు అంశాలలో ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.గారు ప్రతి ఒక్క తీసుకున్న ప్రత్యేక కార్యాచరణల వలన నగరంలో దొంగతనం కేసులు, కోట్లాట కేసులు, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై జరుగు నేరాలు ఘననీయంగా తగ్గినాయి. నగరంలో దొంగతనం కేసులను త్వరితగతిన చేదించి, చోరీ సొత్తును రికవరీ చేయడం, చేధించిన కేసులలో కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం ద్వారా అధిక సంఖ్యలో శిక్షలు పడేలా చేయడం. రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తులపై నగర భాహిష్కరణ మరియు పీ.డి.యాక్ట్ లు అమలు చేయడంలో ఉక్కుపాదం మోపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించిన వారికి మరియు చెడు నడత కలిగిన వారికి ప్రముఖులతో కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి వారిని మంచి మార్గంలో తీసుకురావడంలో కీలకపాత్ర పోషించి నందుకు గాను మరియు వివిధ వి.వి.ఐ.పి./వి.ఐ.పి. కార్యక్రమాలు, దసరా, దీపావళి, ధర్నాలు, రాస్తారోకోలు మొదలగు కార్యక్రమాల బందోబస్తులలో ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు ప్రణాలికలను వేయడంలో కీలక పాత్ర వహించిన ఎస్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్ వరుసగా రెండోసారి డిజిపి డిస్క్ అవార్డుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పీ. కె.వి.రాజేంద్రనాద్ రెడ్డి ఐ.పి.ఎస్. అభినందించడం జరిగింది.అదేవిధంగా ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ నందు విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు డిజిపి డిస్క్ అవార్డులను రాష్ట్ర డి.జి.పి. గారు అందించడం జరిగింది.
అవార్డులను పొందిన అధికారులు:
డిప్యూటీ పోలీస్ కమీషనర్ విశాల్ గున్ని ఐ.పి.ఎస్. డిప్యూటీ పోలీస్ కమీషనర్ మోకా సత్తిబాబు, పశ్చిమ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ డా.కె. హను మంత రావు గారు ఉత్తర డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ సి.హెచ్. రవికాంత్ సెంట్రల్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ పి.భాస్కర రావు దక్షిణ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ డా.బి.రవికిరణ్ పటమట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ డి.కాశీ విశ్వనాథ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్. సురేష్ రెడ్డి