మెదక్ జిల్లా: లోన్ యాప్ వేధింపులు తాళలేక వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా, రామాయంపేట కు చెందిన చాకలి ప్రసాద్(26) కొన్నేళ్లుగా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని (హెచ్ పి) పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. డబ్బులు అవసరం ఉండి లోన్ యాప్ లో కొంతమేర లోన్ గా తీసుకున్నాడు.
కొన్ని రోజుల తర్వాత డబ్బులు చెల్లించాలని లోన్ యాప్ వారు వేధించడం ప్రారంభించారు. తీసుకున్న దానికంటే ఎక్కువ నగదు చెల్లించిన ఇంకా చెల్లించవలసిన నగదు ఉంది అని లోన్ యాప్ వాళ్లు వేధించారు. డబ్బులు లేకపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక తూముకుంట లోని హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలోని చెట్టుకు ఎల్ఈడి లైట్ వైట్ తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే పెట్రోల్ బంకుల్లో పనిచేసే నరేష్ ప్రసాద్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి తన భర్తను చెట్టుపై నుంచి కిందికి దించారు. కానీ అప్పటికే ప్రసాద్ మరణించాడు. సమాచారం అందుకున్న శామీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.