జగిత్యాల జిల్లా: జగిత్యాలలోని కరీంనగర్ బైపాస్ రోడ్డు చౌరస్తాలో ఫిబ్రవరి 28న సాయంత్రం 7-01 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సీనియర్ పంచాయతీ కార్యదర్శి మహ బూబ్ పాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం సాయంత్రం మృతి చెందారు.రెండు ద్విచక్ర వాహనాలు డీ కొనగా తీవ్ర గాయాల పాలయ్యాడు.వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదారాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గత నాలుగు రోజులుగా చికిత్స పొందిన మహబూబ్ పాషా కు బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేసినట్లు తెలిసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. మంగళ వారం సాయంత్రం ఆయన నిమ్స్ ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు.జగిత్యాలకు చెందిన మహబూబ్ పాషా గతంలో బుగ్గారం జి.పి లో సీనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన వెల్గటూర్ మండలం జగదేవ్ పేట పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఉమ్మడి ధర్మపురి మండలంలోని అనేక గ్రామాలతో పాటు ధర్మపురి నియోజక వర్గంలోని పలు గ్రామాలలో కూడా ఆయన ఇంచార్జీ పంచాయతీ కార్యదర్శిగా పని చేశారు. నూతన పంచాయతీ కార్యదర్శుల నియామకం జరిగేంత వరకు పంచాయతీ కార్యదర్శుల కొరత కారణంగా ఏక కాలంలోనే పలు గ్రామాలకు పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహించారు. మహబూబ్ పాషా మరణ వార్త తెలిసి జిల్లా పంచాయతీ కార్యదర్శులు అంతా షాక్ కు గురయ్యారు. మృతుడు మహబూబ్ పాషాకు తల్లి, భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen kumar.