ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో రేపటి నుండి వైద్యం చేయబోమని చెప్పిన దవాఖానలు. సోమవారం నుంచి పూర్తిగా బంద్ కానున్న పోలీసు ఆరోగ్య భద్రత వైద్య సేవలు. చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వైద్య సేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్న దవాఖానలుతమకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం 20వ తేదీలోపు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఎస్ఏహెచ్ఎ) జనవరి 6న ఆరోగ్య భద్రత కార్యదర్శికి లేఖ రాసిందికానీ, ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పోలీసు ఆరోగ్య భద్రత విభాగం అధికారులు చెప్పారు. దీంతో ప్రతినెలా నగదు చెల్లిస్తున్నా.. తమవారికి ఆపద వచ్చినప్పుడు వైద్యం చేయించుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్న పోలీసు కుటుంబాలు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.