జగిత్యాల జిల్లా: మల్లాపూర్ మండలం వేంపల్లి లో వెల్మల రమేశ్ ఉపాధికోసం విదేశాలకు వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. అతని భార్య సునీత (26 వయసు). వీరికి ఒక బాబు పాప ఇద్దరు సంతానం ఉంది.రమేష్ విదేశాల నుండి వచ్చిన నుండి భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.ఈరోజు ఉదయం ఇద్దరి మధ్య గొడవ చిన్నగా మొదలై వాగ్వివాదం పెరిగి భర్త రమేశ్ భార్య సునీతను గోడకు తల కొట్టి హతమార్చాడు.భార్యను హత్యచేసిన రమేష్ పరారు అయ్యాడు. చుట్టుపక్కల వారి సమాచారం ప్రకారం భార్యపై అనుమానం తోనే ఈ పనికి పునుకున్నాడని అర్థం అవుతుంది. కొంత మంది గ్రామస్తులు భర్త కు అక్రమసంబంధం ఉన్న విషయం పై భర్తను వారించిన భార్యపై కోపంతో హత్య చేసినట్టు తెలుస్తోంది.పోలీసులు కేసు నమోదు చేసుకొని హంతకునికోసం వెతుకున్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.