కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలోని చెక్ పోస్ట్ వద్ద రెండు ఆటోలలు మరియు వాటి డ్రైవర్లు ప్రవర్తన అనుమానంగా అనిపించడంతో వాటిని ఆపి ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేయగా అందులో తరలిస్తున్న 118 కేజీల గంజాయి బయటపడింది.ఈ గంజాయి ఒడిశాలోని కలిమెళ నుంచి భద్రాచలం మీదుగా అక్రమ రవాణా చేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తెలిసింది.రెండు ఆటోలలోంచి ఒకరు పారిపోగా.. ఒక మైనర్ బాలుడు, మరొక యువకుడు పట్టుబడ్డారు వారిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.స్వాదీనం చేసుకున్న సరుకు విలువ ఆటోలతో కలిపి గంజాయి విలువ 31 లక్షలు ఉండవచ్చని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.