జగిత్యాల జిల్లా : విధుల్లో భాగంగా ఈ రోజు ఎస్పీ అశోక్ కుమార్ బీర్పూర్ పోలీసు స్టేషన్ ను సందర్శించి పరిశీలించారు. బీర్పూరు ఎస్ఐ మరియు మిగితా సిబ్బంది కి 5s మేతడలజీ తో పనిచేయాలని సుశించారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఉద్ఘాటించారు. గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి అని తెలిపారు. న్యాయం కోసం వచ్చే బాధితులను బాధ్యతగా రిసీవ్ చేసుకోవాలని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని వారికి పోలీసు అంటే భరోసా కలిగేలా వెల్కమింగ్ ఉండాలని తద్వారా సమస్యలు సరైన దారిలో పరిష్కరించేందుకు వీలు ఉంటుందని సలహా ఇచ్చారు.బీర్పోర్ పోలీసు స్టేషన్ సిబ్బంది ఎంతో ఆసక్తిగా ఎస్పీ గారి సలహాలు సూచనలు తీసుకున్నారు మరియు విలువైన సమాచారాన్ని తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేసారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.