హైదరాబాద్ : జవహర్ నగర్లో ఉండే డిగ్రీ విద్యార్థిని పూర్ణిమను నిఖిల్ అనే యువకుడు ప్రేమ పేరుతో తరచూ వేధిస్తూ ఉండే వాడు. అమ్మాయి ఎంత కాదని చెప్పిన అతను వినలేదు, పైగా రోజు రోజుకి అమ్మాయి వెంట పడటం ఎక్కువ చేశాడు.అమ్మాయి తల్లితండ్రులకు చెప్పుకోలేక అతని వేధింపులకు తాళలేక ఏమి చేయాలో ఆమెకు తోచలేదు. అబ్బాయి వదిలేలా లేడు ఇక తాను బ్రతికి ఉండటం కుదరదు అనుకుంది యాసిడ్ తాగి పూర్ణిమ బలవన్మరణం చెందింది. ఆమె శవాన్ని పోస్ట్ మార్టం కు పంపించారు.నిఖిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కూతురు మరణించడం తో తల్లితండ్రులు బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar