జగిత్యాల జిల్లా: మల్లాపూర్ మండలంలోని రేగుంట ప్రభుత్వ పాఠశాలలో ఫిల్టర్ వాటర్ మెషిన్ పాడై పోయి మరియు రిగ్గు మోటార్ చెడి పోవడంతో త్రాగడానికి వాష్ రూమ్ ఇతర అవసరాలకు నీరు లేక ప్రాథమిక పాఠశాల మరియు హైస్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న విషయాన్ని తెలుసుకున్న కొద్ది మంది గ్రామస్తులు విరాళాలు సేకరించి, రిగ్గు బండి తెప్పించి రిగ్గు రిపేర్ చేపించి,ఫిల్టర్ వాటర్ మెషిన్ బాగు చేపించి పైప్ లైన్ నల్ల కలెక్షన్ లు బాగు చేపించి 21000 ఇరవై ఒక్కవేల రూపాయలు ఖర్చు చేసి శనివారం విద్యార్థులకు నీటి సౌకర్యాన్ని కల్పించి పాఠశాల విద్యార్థులకు నీటి కొరతను తీర్చారు..స్కూల్ లో విద్యార్థుల సమస్యలు తెలిపి సహకరించాలని ఒక మాట చెప్పగానే స్పందించి విరాళాలు అందించిన దాతలకు పేరు పేరునా TVSV జాతీయ స్వచ్చంద సేవా సంస్థ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గనవేని మల్లేష్ యాదవ్ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు..పాఠశాల కు ఎలాంటి అవసరాలు ఉన్న ఇక ముందు కూడా గ్రామస్తులందరం ఐకమత్యంతో సహకారం అందించి అండగా నిలుస్తామని తెలిపారు.విరాళాలు అందించి తమ సమస్యలు పరిష్కరించిన దాతలకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
విరాళాలు అందించిన దాతలు,గ్రామస్తులు
పడిగేల నరేష్, పిప్పేర రమేష్,చిలువెరీ అశోక్,హబీబ్, గౌతమ్, ప్రధానోపాధ్యాయులు రాజు, శంకర్ బాబు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు..
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.