జగిత్యాల జిల్లా: బీర్పూర్ మండలంలోని మంగేలా గ్రామంలో ఉన్న గిరిజన ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.తరగతి గదులను, పడక బెడ్లను వంటశాలను, స్టోర్ రూంను తనిఖీ చేశారు. ఫుడ్ ప్రొవిజన్స్ ని పరిశీలించారు. నాణ్యమైన బియ్యం ముడి సరుకులు నాణ్యమైనవి అందించాలి సూచించారు.అలాగే నూతన డైట్ మెనూ ప్రకారం భోజనం రోజూ వారి విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. అనంతరం పాఠశాల ఆవరణలోని డ్రైనేజీ సమస్య ను పాఠశాల ఉపాధ్యాయురాలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.కలెక్టర్ కావాల్సిన మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, టాయిలెట్లను శానిటేషన్ చేయించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు పాఠశాల నిర్వహణలో కాని , భోజన ఏర్పాట్లలో కాని ఎలాంటి నిర్లక్ష్యం వహించిన రాదని కలెక్టర్ ఆదేశించారు.కలెక్టర్ వెంట, ఆర్డీవో, మధు సుధను, జిల్లా విద్యా అధికారి రాము,ఎమ్మార్వో,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A.Naveen Kumar.