:- పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి.
:- ప్రభుత్వం మారితే పాత బకాయిలు తీర్చరా.
:- రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి.
:-ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్.
జగిత్యాల టౌన్: ద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబేర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ఎవో కు వినతిపత్రం అందచేసారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజినీకాంత్ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్న ఇప్పుడు వరకు కూడా విద్యారంగంపై కనీసం సమీక్ష చేయకుండా రాష్ట్ర మంత్రి వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాది, అదేవిధంగా అన్ని శాఖలు కేటాయించిన విద్యాశాఖకు మాత్రం ఎందుకు మంత్రిని కేటాయించలేదని ప్రశ్నించారు. విద్య రంగ సమస్యలు పరిష్కరించాలి. తెలంగాణ రాష్ట్రములో విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబేర్స్మెంట్ స్కాలర్షిప్ 2019 నుండి ఇప్పటి వరకు బకాయిలు పేరుకోని ఉన్నాయన్నారు. 2019- 2020 – 800 కోట్లు, 2020-2021 -2356 కోట్లు,2021-2022 – 2100.43 కోట్లు, 2022-2023 – 2958.14 కోట్లు మొత్తం 8214.57 కోట్లు రూపాయలు ఫీజుల బకాయిలు ఉన్నాయి.ప్రభుత్వం విద్యార్థులు ఆందోళనలు చేసినప్పుడు టోకెన్లు జారీ చేయడం తప్ప ట్రెజరీల నుండి ఒక్కరూపాయి కూడా నిధులు విడుదల చేయడం లేదు. ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు రాలేదనే పేరుతో విద్యార్ధులకు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు. ఉన్నత చదువులకు వెళ్ళాలనే విద్యార్థులు తల్లిదండ్రులు సర్టీఫీకెట్స్ కోసం వడ్డీలకు అప్పులు చేస్తున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. కళాశాల యాజమాన్యాలు కూడా కళాశాల నడపడానికి బయట నుండి అప్పులు తెచ్చి నడుపుతున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలలు మూతవేసే పరిస్థితి ఉందని వాపోతున్నారు. తక్షణమే పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలి అన్నారు.మరియు సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు పెరిగిన ధరలకు 3500 చార్జీలు పెంచాలి ,అద్దె భవనంలో ఉన్న గురుకులాలు హాస్టల్లో సొంత భవనాలు నిర్మించాలి, ఎస్ సి,బిసి,ఎస్ టీ, నూతన కళాశా హాస్టల్స్ ఏర్పాటు చేయాలి,గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరైన సమయానికి బస్ నడపలిని ఖాలుగా ఉన్న టీచర్ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలుసునీత,వినోద్,వినయ్,శేఖర్,మహేష్,రాకేష్,బంటి,అనిల్,అభిమన్యు,తదితరులు పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter
SANJEEV BHANDARI.