జోగులాంబ గద్వాల జిల్లా: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు తీసుకొనుటకు ఏర్పాటు చేసిన “రోడ్డు భద్రతా జిల్లా కమిటీ” సమావేశంలో గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు గారితో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ సంతోష్ BM IAS గారు.ఈ సంద్భంగా పాల్గొన్న పోలీసు అధికారుల నుండి సలహాలు సూచనలు స్వీకరించి, ప్రజలకు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించాలని నిరయించు కున్నారు.ప్రతి రోజూ రోడ్డు పై జరిగే ఆక్సిడెంట్ లకు కారణం వాహనాలు రోడ్డుపై నడిపే సరియైన అవగాహాన లేకపోవడమే నని, డ్రైవర్లు నిర్లక్షం మరియు మితిమీరిన స్పీడ్ గా పేర్కొన్నారు.ప్రజలు రోడ్డుపై డ్రైవింగ్ చేసేటపుడు సరైన రూల్స్ పాటించడం తో పాటు, ఎదురుగా వచ్చే వాహనాల నియంత్రణ కూడా పరిగణించాలని, మద్యం సేవించి వాహనం నడపటం గాని, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం గాని నేరంగా పరిగణించాలని సూసించారు. ఆక్సిడెంట్ వల్ల కోల్పోయే ప్రాణం ఒక్కటి అయిన అది ఆ కుటుంబానికి తీరని లోటుగా పేర్కొన్నారు. రోడ్డు భత్రత కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలను రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించి జీరో ఆక్సిడెంట్ గా రోడ్లను ఉంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.