రాపూరు పోలీస్ స్టేషన్, సర్కిల్ అధికారులు మరియు ఆమంచర్ల చెక్ పోస్టు లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా యస్.పి. గారు.
_పోలీసు స్టేషన్ల పరిధులు, భౌగోళిక స్థితిగతులు మరియు క్రిటికల్ పోలింగు స్టేషన్లు, తాజా పరిస్థితులు, తదితర వివరాలను తెలుసుకున్న యస్.పి. గారు._
పోలీస్ అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా ఎలాంటి అలసత్వం లేకుండా ఎన్నికల విధులు నిర్వర్తించాలి.
క్షేత్ర స్థాయిలో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, టోల్ ప్లాజాల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని, అక్రమ రవాణాను అరికట్టుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.
ఎన్నికల ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీటర్లను వెంటనే బైండోవర్ చేసి, వారి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలి. నాన్ బెయిలబుల్ వారెంట్లను సమర్థవంతంగా అమలు చేయాలి.
సాయుధ దళాలతో రూట్ మార్చ్ నిర్వహించి, ప్రజలు వారి యొక్క ఓటు హక్కు ను స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకునే లాగా భరోసాను కల్పించాలి. గ్రామాలకు వచ్చు, పోయే అనుమానిత/కొత్త వ్యక్తుల సమాచారం సేకరించాలి.
ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
MCC రూల్స్ ను అనుసరించి సదరు చెక్ పోస్ట్ ల వద్ద 24 గంటలు వాహనాల తనిఖీ చేయడం జరుగుతున్నది
ఎన్నికల నియమావళిని అందరూ పాటిస్తూ వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి.
ఎవరైనా ఎన్నికల నియమావళిని అతిక్రమించినట్లు సమాచారం తెలిస్తే సి-విజిల్ యాప్ ద్వారా, (లేదా) టోల్ ఫ్రీ నంబర్ 112 లకు కాల్ చేసి, (లేదా) సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని ప్రజలకు సూచన.