జగిత్యాల జిల్లా: పోలీసు ఫ్లాగ్ డే లో భాగంగా జిల్లా పోలీసు ఆఫీసు లో స్కూల్ విద్యార్థులకు పోలీసు ల యొక్క ప్రాథమిక డ్యూటీ మరియు విభాగాలు గురించి అవగాహన కల్పించారు.పోలీసులు అభివృద్ది చెబుతున్న టెక్నాలజీని ఎలా ఉపయోగించు కుంటున్నారు, ఫేస్ రికార్గనైజేషన్ మరియు సీసీటీవీ కి సంబంధించిన పలు విభాగాలు ఉపయోగించి నేరాన్ని ఛేదించే విధానం మరియు ఆన్లైన్ ద్వారా జరుగుతున్న సైబర్ నేరాలను ఎలా అరికడతారో పోలీసులు విద్యార్థులకు వివరించారు.విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాల పట్ల పోలీసులకు కృతజ్ఞత తెలియజేశారు మరియు ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది లో పోలీసు అవలనే ఆశయాన్ని కలుగజేశారని చిన్నారులు సంబరంగా తెలియపరిచారు.తాము నిర్వహించిన కార్యక్రమం విద్యార్థులకు ఇంతగా నచ్చడంతో తమకు ఎంతగానో సంతృప్తి కలిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వివరించారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar