హైదరాబాద్: పెండింగ్ చాలాన్ల పై తాము ఎలాంటి రాయితీ ప్రకటించలేదని స్పష్టం చేసింది. పెండింగ్ ట్రాఫిక్ చలానాలపై ఎలాంటి రాయితీ ఇవ్వలేదని, వాహనదారులు ఎవరూ నమ్మవద్దని ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ తరహా తప్పుడు ప్రచారాలు చేసిన వారి పై కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. డిసౌంట్లకు సంబంధించి అధికారిక సమాచారాన్ని ట్రాఫిక్ విభాగం నిర్వహిస్తున్న echallan.tspolice.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే తెలుసుకునే వీలుంటుందన్నారు. ఎవరికైనా అనుమానాలుంటే హెల్ప్‌లైన్ నెంబర్లు 040 27852772, 27852721 కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని విశ్వప్రసాద్ తెలిపారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.