ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో నేడు ఈడీ విచారణ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కేటీఆర్*ఈడీ విచారణ అనంతరం ప్రెస్ తో మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్… ఆయన మాట్లాడిన మాటలు, ముఖ్యాంశాలు…** ఫార్ములా-ఈ రేస్ అంశంలో ఈడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్* భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నేను. రాజకీయ వేధింపు ,కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా మీద ఓ అక్రమ కేసు పెడితే విచారణ అధికారులు, విచారణ సంస్థలను గౌరవించి మొన్న తొమ్మిది తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను* ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను* రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలను ఏడు గంటల పాటు అడిగి వివరాలు తీసుకున్నాయి. ఈ రెండు సంస్థలకు ఒక్కటే మాట చెప్పిన. మీరు ఎన్ని సార్లు పిలిచినా వచ్చి సమాధానం చెబుతాను. పూర్తిగా విచారణకు సహకరిస్తానన్నాను* ఈ విచారణకు ₹10 కోట్లు ఖర్చు అవుతుందంటున్నారు. అసలు అవినీతే జరగని ఈ కేసులో అన్ని పైసలను వృథా చేయడం ఎందుకు? ఆ పైసలతోని రైతు రుణమాఫీ చేయొచ్చు? ఇంకా ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చు* అందుకే సంక్రాంతి పండగ సందర్భంగా రేవంత్ రెడ్డికి నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. హైకోర్టు న్యాయమూర్తికాని, ఇంకా ఏవరైనా న్యాయమూర్తి ముందు మీడియా సాక్షిగా లైవ్ డిబేట్‌కు పోదాం* రేవంత్ రెడ్డి ప్యాలెస్‌లో అయినా ఈడీ ఆఫీస్‌లో అయినా, న్యాయమూర్తి ముందు అయినా లై డిటెక్టర్ పరీక్షకు నేను రెడీ. దొంగెవరో? దొరెవరో? ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే నాతో పాటు లై డిటెక్టర్ పరీక్షకు రావాలి* ఫార్ములా-ఈ కార్ రేసు, ఓటుకు నోటు కేసులకు సంబంధించి రేవంత్‌ను, నన్ను ప్రశ్నలు అడగండి. నేను సమాధానం చెప్తాను. ఆయన కూడా జవాబు చెప్పాలి* తేదీ, సమయం రేవంత్ రెడ్డే నిర్ణయించాలి. ఇలా అయితే ఓ యాభై లక్షల్లో మొత్తం నిజం తెలుస్తుంది* ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా ఏసీబీకి రేవంత్ రెడ్డి దొరికిండు.. కాబట్టే నా మీద కూడా ఏసీబీ కేసు పెట్టిచ్చిండు. రేవంత్ రెడ్డి మీద ఈడీ కేసు ఉంది కాబట్టే నా మీద ఈ ఈడీ విచారణ జరిపిస్తున్నారు* అంతిమంగా నిజం, న్యాయం, ధర్మం నిజాయితీనే గెలుస్తుంది* హైకోర్టు. సుప్రీంకోర్టు, భారత న్యాయవ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద నాకు విశ్వాసం ఉంది* ఇవాళ కాకుంటే ఇంకో నాలుగు రోజులకైనా ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలుస్తాయన్న విశ్వాసం నాకుంది* ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు* నేను తప్పు చేయలేదు తప్పు చేయబోను. ఇందులో అరపైసా అవినీతి కూడా జరగలేదు* 8 గంటలు వాళ్ళ అడిగిందే అడిగారు.. నేను చెప్పాను.. తప్పు చేసినట్టు రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా రెడీ* పారదర్శకంగా నిధుల బదిలీ జరిగింది.. ఇంకెక్కడ మనీ లాండరింగ్ అని ఏసీబీ, ఈడీ అధికారులను అడిగాను* ఏసీబీ 80 ప్రశ్నలు, ఈడీ 40 ప్రశ్నలు అడిగింది. అన్నింటికి సమాధానాలు ఇచ్చాను.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.