జగిత్యాల జిల్లా వివరాల్లోకి వెళ్ళితే… మున్నీసుల శ్రీనివాస్, చిప్పబత్తుల తులసయ్య , బక్కెనపల్లి అరుణ్ , యశోద శ్రీనివాస్ , సైదు సహదేవ్, రత్నం మాణిక్యం మరియు ముకునూరి కిరణ్ కుమార్ లు ఒక గ్యాంగ్ గా ఏర్పడి కొన్ని రోజుల నుండి కిరణ్ దగ్గర ఉన్న ఒక యంత్రం తో గుప్తా నిదుల కోసం వెతుకుతూ ఉండేవారు ఎక్కడ కూడా గుప్తా నిధులు దొరకకపోవడంతో పై వారందరూ కలిసి ఎవరన్నా బాగా డబ్బులు ఉన్న వారి ఇంట్లో దోపిడి చేసి వచ్చిన డబ్బులతో జల్సా చేద్దామనుకుని ఒకరోజు తుమ్మెనల ధగ్గర గల సహదేవ్ హోటల్లో కలిసి బీర్పూర్ లో డబ్బులు, బంగారం ఉన్న ఒక సేటు కాసం ఈశ్వరయ్య ఇంట్లో తాను, అతని బార్య మాత్రమే ఉంటారు, వారు ముసలి వాళ్ళని, వాళ్ళ ఇంట్లో చొరబడి దోపిడి చేస్తే మనకు డబ్బు, బంగారు ఆభరణాలు దొరుకుతాయని పథకం వేసుకొని. తేదీ 13.12.2024 రోజున రాత్రి పై అందరూ కలిసి తుమ్మెనల ధగ్గర గల సహదేవ్ హోటల్లో కలుసుకొని. మంకీ క్యాప్ లు దరించి బొమ్మ తుపాకీలు పట్టుకొని కిరణ్ కుమార్, అరుణ్, తులసయ్య, మున్నేసుల శ్రీనివాస్ లు ఒక నెంబర్ లేని వైట్ కలర్ access 125 స్కూటీ, బ్లాక్ కలర్ passion pro బైక్ ల మీద బీర్పూర్ కి వెళ్ళి అర్ధరాత్రి 2.30 గం. లకు కాసం ఈశ్వరయ్య ఇంటి వెనకాల నుండి గోడ దూకి బాత్రూమ్ దగ్గర జాక్కొని ఉన్నారు. ఉదయం 5.00 గం.లకు ఈశ్వరయ్య బాత్రూమ్ కి వెళ్లడానికి రాగా అతనిని గట్టిగా అధిమి పట్టి బొమ్మ తుపాకితో తల మీద కొట్టి చంపుతామని బెదిరించి , ఇంట్లోకి ఈడుచుకెళ్లి ఈశ్వరయ్య, అతని బార్యను కూడా కొట్టి గుడ్డ పేగులు నోట్లో కుక్కి వారిని కట్టేశారు. వారి వొంటి మీద ఉన్న బంగారు ఆబరణాలు, ఇంట్లో ఉన్న డబ్బులు దోపిడి చేసుకొని అక్కడి నుండి ఫారెస్ట్ మార్గం ద్వారా పారిపోయు తుమ్మెనలకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ సహదేవ్, రత్నం మాణిక్యం లు ఉన్నారు. దర్యాప్తు లో బాగంగా జగిత్యాల జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారి ఆదేశానుసారం , జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ ఆధ్వర్యం లో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. పోలీసు విచారణలో కొందరు నిండుతులు దర్మపురి మండలం లోని తుమ్మెనల గుట్ట దగ్గర ఉన్నారని నమ్మకమైన సమాచారం మేరకు ఈ రోజు తేదీ.20.12.2024 ఉదయం 11.00 గం.లకు సహదేవ్ హోటల్ దగ్గర ఆరుగురు నింధితులను అదుపులోకి తీసుకొని పంచుల సమక్షంలో విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు .
పట్టుబడ్డ నిందితుల వివరాలు:
- మున్నేసుల శ్రీనివాస్ s/o లక్ష్మణ్, 29 సం., SC నేతకాని, r/oమున్యాల్ (v), దస్తూరాబాద్(m).
- చిప్పబత్తులతులసయ్య s/o బద్రయ్య, 60 సం., మంగలి, Occ. రికార్డు అసిస్టెంట్, ZPHS పౌనూర్, జైపూర్(m), r/o H.No. 14-95/1, గోదావరి రోడ్, గోపవాడ, లక్షేట్టిపేట్.
- బక్కెనపల్లి అరుణ్ s/o రమేశ్, r/o గుట్రాజ్పాల్లి(v), జగిత్యాల రూరల్(m).
- యశోధా శ్రీనివాస్ s/o నర్సయ్య, 45 సం., వడ్రంగి, Occ. కార్పెంటర్. r/o బీర్పూర్(v)(m),
- సైదు సహదేవ్s/o భీమయ్య, 57 yrs, ముదిరాజ్, Occ. కాల బైరవ డాబా, తుమ్మెనల X రోడ్ of ధర్మపురి. r/o అనంతరం(v), జగిత్యాల రూరల్(m),
- రత్నం మాణిక్యం s/o శంకర్, 40 సం., SC నేతకని, Occ. ఆటొ డ్రైవరు, r/o మురిమడుగు(v), జన్నారం(m),
పరారీ లో ఉన్న నిందితుని వివరాలు :1. ముకునూరి కిరణ్ కుమార్ s/o బ్రహ్మయ్య r/o పోచమ్మవాడ, మంచిర్యాల*స్వాదీన పరుచుకున్న వస్తువుల వివరాలు :
- Gold Bracelet, Gold Chain, Gold Pusthelu Thradu, Ear studs, Gold Ring-2 (Approx. 10
Tulas Gold Worth Rs 5,00,000/-) - 10,000/- cash
- 6 smart mobile phone.
- Passion Pro Bike-1
- Toy pistols-2
ఇట్టి నేరం ను ఛేదించి నేరస్తులను పట్టుకునుటలో పాల్గొన్న CI వై. కృష్ణారెడ్డి, SI లు కుమారస్వామి, సదాకర్, శ్రీదర్ రెడ్డి, దత్తాద్రి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్, కానిస్టేబుల్స్ గంగాధర్, శ్రీనివాస్, వెంకటేష్, ముత్తయ్య, సుమన్, రవి, రమేశ్ నాయక్, లింగారెడ్డి, శివ, పరమేష్, జలంధర్ మరియు టెక్నికల్ టీమ్ మహేశ్ , మల్లేశ్ లను అభినందించి జిల్లా ఎస్పి అశోక్ కుమార్, ఐపిఎస్ గారు అభినంధించి నగదు ప్రోత్సాహకం ను అధించినారు.
Our Telangana Citizen Reporter.
Mr. A.Naveen Kumar.