మహబూబాబాద్ జిల్లా: అప్పు కట్టాలని రైతులకు నోటీసులు ఇస్తున్న బ్యాంకు యాజమాన్యాలు, అప్పు కట్టకపోతే జెండాలు పాతి భూమిని వేలం వేస్తాం అని బెదిరింపులు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన మందుల యాకన్న అనే రైతు తీసుకున్న అప్పు అసలు వడ్డీ కలిపి రూ.1.25 లక్షల వరకు ఉంది
ప్రభుత్వం పూర్తి రుణమాఫీ చేశాము అని చెప్పింది కానీ తనకు ఎలాంటి రుణమాఫీ జరగలేదని, ప్రభుత్వం రైతుబందు ఇవ్వక పెట్టుబడి కోసం చేసిన అప్పులే ఇంకా తీర్చలేకపోతున్నాం, బ్యాంకు రుణాలు ఎలా చెల్లించాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు
నర్సింహులపేట మండలంలో దాదాపు 20 మంది రైతులకు బ్యాంకు నోటీసులు వచ్చాయని, ఒకవైపు నీళ్ళు లేక పంటలు ఎండిపోతుంటే మరోవైపు బ్యాంకులు నోటీసులతో బెదిరిస్తే తాము ఎలా బ్రతకాలి అంటూ రైతులు వాపోతున్నారు.
Our Telangana Citizen Reporter
Mr. A. Naveen Kumar.