హైదరాబాద్: ఆస్తి గొడవల కారణంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు(86) తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. సొంత మనవడే ఆస్తికోసం చంద్రశేఖర్‌ని హత్య చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆస్తికోసం గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయని తెలిపారు.ఈ క్రమంలోనే తాతపై మనువడు కీర్తి తేజ పగను పెంచుకున్నారని చెప్పారు. ఆ కారణంగానే హత్య చేసినట్లు తెలుస్తోందన్నారు. 73 సార్లు చంద్రశేఖర్‌ని కత్తితో మనవడు కీర్తి తేజ పొడిచి చంపారని అన్నారు. మిగతా మనవలను చూసినట్లుగా తనను చూడలేదని కసితో హత్య చేసినట్లు పోలీసులు వివరించారు.
*పోలీసుల కథనం ప్రకారం….*
‘‘ఇటీవల కంపెనీలో ఒక మనవడికి డైరెక్టర్ పోస్ట్‌ను చంద్రశేఖర్ ఇచ్చాడు. తనకు కూడా డైరెక్టర్ పోస్టు కావాలని కీర్తి తేజ తన తాతయ్యను డిమాండ్ చేశాడు. అమెరికాలో ఉండి ఇటీవలే హైదరాబాద్‌కు కీర్తి తేజ వచ్చాడు. కీర్తి తేజ చెడు వ్యసనాలను చూసి డైరెక్టర్ పోస్టును చంద్రశేఖర్ ఇవ్వలేదు. డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకపోవడంతో 73 సార్లు కసితో కీర్తి తేజ చంపాడని పోలీసులు తెలిపారు.చంద్రశేఖర్‌ని చంపుతుంటే అడ్డం వచ్చిన తల్లిపై 12సార్లు కీర్తి తేజ పొడిచాడు. తల్లి తాత అరుపులు విని ఇంట్లోకి స్థానికులు వచ్చారు. అప్పటికే చంద్రశేఖర్ చనిపోగా తీవ్ర గాయాలతో కీర్తి తేజ తల్లి కొట్టుమిట్టాడారు. కీర్తి తేజ తల్లిని ఆస్పత్రికి పోలీసులు తరలించారు. తాతను చంపి తల్లిని గాయాల పాలు చేసి కీర్తి తేజ ఏలూరు పారిపోయాడు. కీర్తి తేజను ఏలూరులో పోలీసులు అరెస్టు చేశారు. టీటీడీకి గతంలో రూ.40 కోట్లకు పైగా విరాళాలను చంద్రశేఖర్ ఇచ్చారు. ప్రముఖ వెల్జాన్ కంపెనీకి చైర్మన్‌గా చంద్రశేఖర్ కొనసాగుతున్నారు. వందల కోట్ల రూపాయల ఆస్తులను చంద్రశేఖర్ కలిగి ఉన్నారు’’ అని పోలీసులు తెలిపారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.