కమలాపూర్ మండలం : శనిగరం గ్రామానికి చెందిన వక్కల పద్మ అనే మహిళ, తన భర్త మద్యపాన వ్యసనం కారణంగా తీవ్ర మానసిక కష్టానికి గురై ఆత్మహత్యాయత్నం చేయాలని నిర్ణయించుకుంది. ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై కూర్చుని ఆత్మహత్య చేసుకోబోతుండగా రైల్వే సిబ్బంది ఆమెను గమనించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ హరికృష్ణ, మహిళతో సున్నితంగా మాట్లాడి ఆమె మనస్సును ప్రశాంతం చేశారు. ఆ తర్వాత ఆమెను ఆమె సోదరుడికి అప్పగించారు. స్థానిక పోలీసుల సకాల చర్య వల్ల ఒక ప్రాణం రక్షించబడింది.
Our Telangana Citizens Reporter.
Mr. Rakesh Gandhe