జగిత్యాల :తెలంగాణలోని శ్రీనివాసుల పేరు గల వారందరు కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకుని వివిధ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.అయితే శ్రీనివాస్ ల సంఘం ఏర్పటై ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఆదివారం జగిత్యాలలో ప్రథమ వార్షికోత్సవం సందర్బంగా తలసేమియా బాధిత పిల్లలకు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకున్నామని శ్రీనివాసుల సంఘం ప్రతినిధి ఏఎస్సై రాజేషుని శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ రోడ్ లో గల జగిత్యాల రెడ్డి ఫంక్షన్ హల్లోనేడు ఉదయం 9 గంటలకు తలసేమియా భాదిత పిల్లల కోసం మెగా రక్తదాన శిభిరం ఏర్పాటు చేశామని ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరువుతున్నారని శ్రీనివాస్ తెలిపారు. ఈ మహోన్నతమైన కార్యక్రమానికి మిమల్ని మనసారా ఆహ్వానిస్తూ తలసేమియా చిన్నారుల మొహంలో ఆనందం చూస్తూ ఇంకో ఇరవై రోజులు జీవితాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చిన మా తెలంగాణ శ్రీనివాసులందరికి రాజేసుని శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
Our Telangana Citizen Reporter.
Mr. Shivakumar Chippa