జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, పరిసర గ్రామాల ప్రజల ఆకాంక్ష మేరకు గత ప్రభుత్వం లో మండల కేంద్రం ఏర్పాటుకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ప్రతిపాదించగా ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన ఎమ్మెల్యే అల్లిపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని విన్నవించారు. అల్లిపోర్ గ్రామం చుట్టుపక్కల ఆరు గ్రామాలకు నిత్యం అవసరాలు తీరుస్తుంది. అనేక విషయాల్లో కూడా ప్రజలు అల్లిపూరు గ్రామం పై ఆధార పడ్డారు. ఆల్లిపూర్ ను మండలం గా మార్చటం వలన ప్రజలకు మండల కేంద్ర అవసరాలు కూడా త్వరిత గతిన తీరుతాయి మరియు సదరు ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. ఆల్లిపూర్ ను మండలం గా మార్చుకోవటం కోసం ఆ గ్రామమే కాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎన్నో సార్లు ఉద్యమ చేశారు, నాయకులకు విన్నవించారు.అల్లిపుర్ మరియు పరిసర గ్రామాల వివిధ కుల సంఘాల నాయకులు, రైతులు,తాజా మాజీ ప్రజా ప్రతినిదులు ,ప్రజలు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే క్వార్టర్లో కలిసి ముఖ్యమంత్రి గారికి అల్లిపూర్ మండల కేంద్రం విషయంలో విన్నవించినందుకు గాను ధన్యవాదాలు తెలిపి,ఆల్లిపూర్ మండల కేంద్ర ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.స్పందించిన ఎమ్మెల్యే అల్లి పూర్ మండల కేంద్రం ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని,వచ్చే క్యాబినెట్ సమావేశం లో అల్లిపూర్ ను నూతన మండలం గా ప్రతిపాదనకు కృషి చేస్తానని అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.