హైదరాబాద్: ఈ ఏడాదికేసుల నమోదు పెరిగిందని, తెలంగాణ డిజిపి జితేందర్ తెలిపారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన నేర వార్షిక నివేదికను విడుదల చేసి మాట్లాడారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య9.87 పెరిగాయని,ఒకటి రెండు ఘటనలు మినహా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. తెలంగాణలో 2024 సంవత్సరానికి సంబంధించి క్రైమ్ రేట్, లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్ నేరాలపై వార్షిక నివేదికను ఆదివారం విడుదల చేశారు. *ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..* ఈ ఏడాది మొత్తం 2,34, 158 కేసులు నమోదయ్యా యని, గత ఏడాదితో పోలి స్తే ఈ ఏడాది 9.87శాతం కేసులు పెరిగాయని చెప్పారు. 85మంది నక్సల్స్ అరెస్ట్ కాగా, 41 మందిని సరెండర్ చేయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1942 డ్రగ్స్ కేసులు నమోదు కాగా అందులో 4682 మందిని అరెస్ట్ చేశామని, 142.95 కోట్ల డ్రగ్స్ పట్టుకోవటం జరిగిందని, జీరో శాతం డ్రగ్స్ దిశగా పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుందని డీజీపీ తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు పెరిగా యని డీజీపీ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 43.33 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25,184 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా.. 180 కోట్లు వదిలిన ఫండ్స్ రీఫండ్ అయిపోతే, 247 కోట్లు విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. కొత్త చట్టాలు వచ్చిన తరువాత 85,190 కేసులు నమోదయ్యాయని, జీరో ఎఫ్ఐఆర్ కింద 1,313 కేసులు కొత్త చట్టాలు వచ్చిన తరువాత నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది 547 మంది ఎస్ఐలు, 12,338 మంది కానిస్టేబుల్స్ నియామకం జరిగింది. డయల్ 100 ద్వారా 16,92,173 కాల్స్ వచ్చినట్లు డీజీపీ తెలిపారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.