కరీంనగర్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. తన వద్ద బస్సు ఛార్జీలు లేవని, మాల్యా వద్ద దింపాలని అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడిని అడిగాడు. అందుకు నిరాకరించడంతో తన వద్ద ఉన్న మత్తు మందు పిచికారీ చేశాడు.
దీంతో ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన సునీల్ కొద్ది రోజులుగా తిరుగుతున్నాడు. మంగళవారం రాత్రి జగిత్యాలకు చేరుకుని ఓ ప్రయాణికుడిపై మత్తు మందు చల్లాడు. అస్వస్థతకు గురైన ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సునీల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.