వరంగల్: మద్యం సేవించి వాహనాన్ని నడిపిన అశోక్ భాహే,నల్లబోయిన రాజు,శీలం జాలార్, మునిగడప నాగరాజు భానోత్ జుమ్మిలాల్ లకు రెండు రోజులు సమాజ సేవ చేయాలని శిక్ష విధిస్తూ ఇక్కడి రెండవ శ్రేణి న్యాయమూర్తి కే.రాజశేఖర్ రెడ్డి గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు ఇలాఉన్నాయి. కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ పి. నాగబాబు ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో పైన పేర్కొన్న వాహనదారులు మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులకు దొరికిపోయారు.శ్వాస పరీక్ష నిర్వహించిన అనంతరం సదరు వ్యక్తులు అధిక మోతాదు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లుగా నిర్ధారణ అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు.విచారణ అనంతరం సదరు వ్యక్తులు అధిక మోతాదులో మద్యం సేవించి వాహనం నడపడం నేరం గా పేర్కొంటూ రెండు రోజులు సమాజ సేవ చేయాలని న్యాయమూర్తి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.కోర్టు ట్రాఫిక్ కానిస్టేబుల్ బి. కుమార్ సదరు వ్యక్తులను కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి విధించిన శిక్షను అమలుపరిచే క్రమంలో ఆ వ్యక్తులను కాజీపేట సర్కిల్ మున్సిపల్ కమీషనర్ ముందు హాజరు పరిచారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.