
సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ రూరల్. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన నెంబరబోయిన దుర్గాప్రసాద్ (26) శీలం ఉపేందర్ (24) లు హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సమీప బంధువులను పరామర్శిం చడానికి వచ్చారు. తిరిగి వెళుతుండగా గోపాలపురం గ్రామం మసీదు సమీపంలో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ని వారి పల్సర్ బైక్ తో బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో వారిద్దరి తలలకి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 కి సమాచారం అందించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. గ్రామానికి చెందిన యువకులు మృతి చెందటడంతో కీతవారిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు శవపరీక్షనిమిత్తం మృత దేహాలను ఏరియాఆసుపత్రి శవాగారంలో భద్రపరిచారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.