హైదరాబాద్: KPHB కంచుకోట టిఫిన్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 2 బైకులు, హోటల్ ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిఉండవచ్చని తెలిపారు, సుమారు 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అభిప్రాయపడ్డారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.