ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పత్రికలే వాళ్ళ గొంతుకై గర్జించాలె,
జర్నలిస్టులే వాళ్ళకు రక్షణ కవచాల్లా నిలబడాలె,
అదృష్టం కలిసొచ్చి వారు ముఖ్యమంత్రులు అయ్యాక అదే జర్నలిస్టులను క్రిమినల్స్ అనీ, బట్టలూడదీసి కొడతామని గర్వం తలకెక్కి నా అంతటి సిపాయి మరొకడు లేడనుకుని నీతిమాలిన వ్యాఖ్యలు చేయాలె.
గతంలో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ ఇద్దరిదీ అదే దారి.!
ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు నెరవేర్చలేకపోయినపుడు
ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వాలు గాలికొదిలేసినపుడు సహజంగానే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తుంది. ప్రజల అభిప్రాయాన్ని, మనోగతాన్ని ఉన్నదున్నట్లుగా వాస్తవాలను రాసే బాధ్యత జర్నలిస్టుల పైన ఉంటుంది. వాస్తవాలను పక్కనపెట్టి పాలకులకు అనుకూలంగా అవాస్తవాలను రాయడానికి జర్నలిస్టులు పాలకుల దొడ్లో జీతగాళ్ళు కాదనే విషయాన్ని వారు గమనించాలి.
పాలకుల అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వాస్తవాలను ప్రచురించే జర్నలిస్టులపైన కక్షసాధింపు చర్యలకు పాలకులు పాల్పడడం సిగ్గుమాలిన చర్య.
మీ అడుగులకు మడుగులొత్తకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టకుండా నిజాలు నిర్భయంగా రాసే జర్నలిస్టుల పైన పాలకులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జర్నలిస్టులను ఎంత నిర్బంధించినా మా పెన్నులే గన్నులై గర్జిస్తా ఉంటయ్. సిరా చుక్కలే తూటాలై పేలుతా ఉంటాయ్.! మా(జర్నలిస్టుల)బాస్ లు ప్రభుత్వాలో ప్రతిపక్షాలో ప్రభుత్వాధినేతలో కాదు మా హైకమాండ్ ప్రజలు మాత్రమే. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతటివాడినైనా ఎదిరిస్తూనే ఉంటాం, నిజాలను నిర్భయంగా రాస్తూనే ఉంటాం.!!(సీఎం స్థాయిని దిగజార్చేలా జర్నలిస్టులను బట్టలూడదీసి కొడతామని రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ…)
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen kumar.