తెలంగాణ సమయం ప్రతినిధి.…
హైదరాబాద్, డిసెంబర్ 28 :
భారతదేశంలోని జర్నలిస్టులు ఒక అనిశ్చిత వాతావరణంలో ప్రమాదకర పరిస్థితులలో పనిచేస్తున్నారు. తరచుగా జర్నలిస్టులు భద్రతా పరమైన ముప్పును ఎదుర్కొంటున్నారు
“ఇండియా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇనిషియేటివ్” సమన్వయకర్త సుహాస్ చక్మా తన వార్షిక నివేదిక లో సభ్య సమాజం విస్తుపోయే వివరాలను తెలియచేసారు. వారు తన నివేదికలో పొందుపరిచిన వివరాలను పరిశీలిస్తే….
2015లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల్లో 76% మంది హత్యలకు గురైనారు. ఇందులో వృత్తిపరంగా వివిధ సందర్భాలలో సంచలన సమాచారాన్ని బయట పెట్టినందుకు రాజకీయ పరమైన పగ ప్రతీకారాలతో హత్యలకు గురైనవారిలో జర్నలిస్ట్ లే అధికులు అని అధ్యయనం వెల్లడించింది.
ఈ నివేదిక జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న ప్రమాదాల తీవ్రతను సూచిస్తుంది. ఈ జర్నలిస్ట్ హత్యలలో 56% హత్యలు పేరువున్న రాజకీయ పక్షాల నాయకులు సామాజిక సమూహాలు పాల్పడ్డాయి. 7% హత్యలు వివిధ నేర ముఠాలు చేశాయి అని గణాంకాలు చెపుతున్నాయి. జర్నలిస్ట్ ల పై జరిగిన దాడుల గత చరిత్ర ఇలా వుంటే… వర్తమానంలో జర్నలిస్టులపై జరిగిన దాడులు జరిగిన హత్యలకు సంబందించి నమోదైన గణాంకాలు పరిశీలిస్తే… పాత్రికేయులు ఎంత ప్రాణాంతక పరిస్థితులలో పనిచేస్తున్నారో సమాజానికి అర్ధం అవుతుంది.
2024 లోజర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగాయి. వృత్తి నిర్వహణలో కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే 2023లో ఐదుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. దేశవ్యాప్తంగా 226 మందిపై ప్రభుత్వ సంస్థలు, సంఘ వ్యతిరేక వ్యక్తులు, నేరస్తులు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని వివిధరకాలుగా ఇబ్బందులకు గురిచేశారు.
చంపబడిన జర్నలిస్టుల వివరాలు రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే..!
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, అస్సాం, మహారాష్ట్ర, బీహార్లలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 54 మంది జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్(25), మణిపూర్(22), యూపీ(20), కేరళ(16), జార్ఖండ్(11), మహారాష్ట్ర, తెలంగాణ8 చొప్పున హత్యలు ,దాడులు జరిగాయి
అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్(7 చొప్పున), ఛత్తీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, కర్ణాటక, ఓడిశా(5 చొప్పున), ఏపీ, హర్యానా(4 చొప్పున), పంజాబ్(3), త్రిపుర(2), తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరాఖండ్(ఒక్కరు చొప్పున) దాడులకు హత్యలకు గురి అయ్యారు. ఇక దేశవ్యాప్తంగా 30 మంది మహిళా జర్నలిస్టులు అనేక వ్యవహారాల్లో టార్గెట్ చేయబడుతున్నారని నివేదిక తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా 12 మంది, కేరళ, మణిపూర్(5 మంది చొప్పున), పశ్చిమ బెంగాల్(3), పంజాబ్(2), ఒడిశా, తెలంగాణ, యూపీ(ఒక్కరు చొప్పున) మహిళా జర్నలిస్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. వీరిలో ముగ్గురు అరెస్ట్ లేదా నిర్భంధానికి గురికాగా, తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇంకా కొందరిపై వ్యక్తిగతంగా దాడి చేయడం, ఇళ్లపై దాడులు వంటి సంఘటనలు కూడా ఉన్నాయని నివేదిక తెలిపింది.
“భారత్‌లో సామాజిక ప్రయోజనం కోసం సత్యనిష్టతో పాత్రికేయ వృత్తిని అవలంబించే వారి ప్రాణాలకు భద్రత కరువైంది. సమాజంలోని రాజకీయ సామాజిక వ్యాపారవర్గాల నుండే కాక అధికారవర్గం నుండి కుడా అత్యంత ప్రాణాంతక క్రూర దాడులకు నిత్యం గురి అవుతూ జర్నలిజం దేశంలో అత్యంత ప్రమాదకరమైన వృత్తిగా మారింది” అన్నారు.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలా వ్యవహరించే పత్రికా, టీవీ వ్యవస్థపై జరుగుతున్న దాడులు చూస్తుంటే.. ప్రజాస్వామ్యానికి నియంతృత్వ వ్యవస్థ నుండి ఎదురైనా మొదటి హెచ్చరిక లా’ వుంది అని ఇండియా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇనిషియేటివ్ సమన్వయకర్త సుహాస్ చక్మా ఒక నివేదికలో విమర్శించారు.
ఎడిటర్స్ గిల్డ్ నివేదికల ప్రకారం..
జనవరి 5, 2024: ప్రభాత్ ఖబర్ చీఫ్ ఎడిటర్ మిస్టర్ అశుతోష్ చతుర్వేదిపై జార్ఖండ్ పోలీసులు IPC సెక్షన్లు 469, 501, మరియు 502 కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) నమోదు చేశారన్న వార్తలను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది
రెసిడెంట్ ఎడిటర్ శ్రీ విజయ్ కాంత్ పాఠక్, అలాగే MD, Mr. రాజీవ్ ఝవార్, మిస్టర్ జోగేంద్ర తివారీ దాఖలు చేసిన ఫిర్యాదుకు ప్రతిస్పందనగా… డిసెంబర్ 29, 2023: 24 న్యూస్ అనే టెలివిజన్ ఛానల్ రిపోర్టర్‌పై విద్యార్థుల నిరసనకు సంబంధించి కేరళ పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేయడం పైఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది
ఫిబ్రవరి 10, 2024: శుక్రవారం పూణె నగరంలో సీనియర్ జర్నలిస్ట్ మిస్టర్ నిఖిల్ వాగ్లేపై జరిగిన దాడిని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది.
ఫిబ్రవరి 22, 2024: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఒక టీవీ జర్నలిస్టుపై పార్టీ కార్యకర్తలు గుంపులు గుంపులుగా భౌతిక దాడికి పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన సంఘటనపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.
ఫిబ్రవరి 20, 2024: పశ్చిమ బెంగాల్‌లోని సందేస్‌ఖాలీ నుండి రిపబ్లిక్ బంగ్లా టివి ఛానల్ పనిచేస్తున్న టీవీ జర్నలిస్ట్‌ని సోమవారం అరెస్టు చేయడంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. సున్నితమైన రాజకీయ అంశాలు మరియు నేర కార్యకలాపాలపై నివేదించడం వల్ల జర్నలిస్టులు ఎదుర్కొనే ప్రమాదాలను పై సంఘటనలు తెలియచేస్తున్నాయి. భారతీయ జర్నలిస్టులు ఎంత ప్రమాద కర పరిస్థితులలో వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారో పై ఘటనలు నొక్కి చెబుతున్నాయి. ముఖ్యంగా అవినీతి, నేరాలు మరియు మానవ హక్కుల ఉల్లంఘనలపై నివేదించే సమాచారం వారిని మరిన్ని ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయి. వాస్తవ పరిస్థితులు ఇలా వుండగా…
తెలంగాణాలోని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లి ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీకి 2006-2008 మధ్య జర్నలిస్ట్ గృహ వసతి కోసం కేటాయించిన 72 ఎకరాలకు సంబందించి తుది తీర్పులో…
“రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగు స్తంభాలు గా నిలిచే శాసన, కార్యనిర్వహక, న్యాయ, మీడియా వ్యవస్థలు కలిసి స్వప్రయోజనాల రక్షణ లో భాగంగా విలువైన ప్రభుత్వ ఆస్తులను స్వంతం చేసుకోవాలని కుట్ర చేసారు. జర్నలిస్టులు తమ తమ వృత్తిపరమైన భాద్యతలు నుండి తప్ప్పుకోవటానికి లేదా సమాజంలో జరిగే తప్పులను కప్పిపుచ్చుడానికి సిద్దం అయ్యారు. ప్రజాస్వామ్యానికి మూడు స్తంభాల వంటి వ్యవస్థలలో జరిగే తప్పులకి అనుకూలంగా ఉన్నారని” జస్టిస్ ఖన్నా తన యొక్క పరిశీలనగా చెప్పుకొచ్చారు.
కానీ పై ఘటనలు పరిశీలించి చూస్తే జస్టిస్ ఖన్నా పరిశీలనకు పూర్తి విరుద్ధంగా వాస్తవ పరిస్థితులు వున్నాయి. కాబట్టి దయచేసి గౌరవ సుప్రీం కోర్టు వారు సమాజంలో పాత్రికేయుల వాస్తవ స్థితిగతులను దృష్టి లో పెట్టుకుని మానవీయ దృష్టిలో పెట్టుకుని… ఆర్టికల్ 15 (4), ఆర్టికల్ 16(4) ప్రకారం ప్రత్యేక సమూహంగా గుర్తించి మా హక్కులను పరిరక్షిస్తూ.. మా జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకు అవసరమైన కనీస అవసరాలు ఆయిన గృహవసతి కల్పించేందుకు ప్రభుత్వాలకు అవకాశాలు కల్పిస్తూ జస్టిస్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ భట్ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పున:పరిశీలించి… పాత్రికేయ సమాజానికి తగు న్యాయం చెయ్యాలని ప్రార్ధిస్తున్నాం
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.