జగిత్యాల: ధర్మపురి పోలీస్ స్టేషన్ అకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ *పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు ధర్మపురి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహించాలని , సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, తరచూ గ్రామాలను సందర్శించి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పై, నూతన చట్ట ల పై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.ఎస్పీ వెంట సీఐ రామ్ నరసింహారెడ్డి రెడ్డి,ఎస్.ఐ ఉదయ్ కుమార్ , మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter.
Rakesh Gandhe.