పోలీసులు అదుపులో ఐదుగురు ముఠా సభ్యులు.
జగిత్యాల జిల్లా : జగిత్యాలలో క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ పేరుతో ప్రజలతో పెట్టుబడి పెట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ తెలిపారు. పట్టణ సీఐ వేణుగోపాల్ మాట్లాడుతూ గుమ్మడాల నర్సయ్య, కోయల్కర్ వేణు, ఆరె రాజేష్, కూరెల బాబు, కొట్టె మారుతిలు ముఠాగా ఏర్పడి అమాయక ప్రజలను ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ప్రజలకు ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. కష్టపడకుంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారిని, వ్యాపారం చేసే వారిని, మధ్య తరగతి వారికి ఆన్లైన్ కాయిన్ వ్యాపారం గురించి తెలిపి డబ్బులు కట్టించారు. జగిత్యాల పట్టణంలో మొదలైన ఈ దందా జగిత్యాల పరిసర గ్రామాలు, ఇతర పట్టణాలకు విస్తరింప జేసి ప్రజలను మోసం చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు ఐదుగురు నిందితులైన గుమ్మడాలనర్సయ్య, కోయల్కర్ వేణు, ఆరె రాజేష్, కూరెల బాబు, కొట్టె మారుతి, మరికొందరు రిక్సోస్ ట్రేడ్ యాప్ ద్వారా, యూఏస్డిటి బెప్ 20 అనే క్రిప్టో కరెన్సీ అని, దీనిలో పెట్టుబడులు పెడితే యూఏస్ డాలర్ రూపంలో డబ్బులు వస్తాయని, 18 నెలల్లో పెట్టిన పెట్టుబడి కాకుండా 5 నుండి 10 రేట్లు డబ్బులు వస్తాయని, పెట్టిన డబ్బులకు ప్రతి రోజు ఒక్క శాతం కమిషన్ వస్తుందని, ఎంత మంది ఈ యాప్ లో జాయిన్ చేయిస్తే అంతా లాభాలు వస్తాయని, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, మధ్య తరగతి వారితో పెట్టుబడులు పెట్టించి వారికి నెలకు కొంత సొమ్ము చెల్లీస్తూ వ్యాపారాన్ని విస్తరించారని తెలిపారు. ఈ వ్యాపారం వెబ్ పోర్టల్ పని చేయకపోతే ముందుగా జాయిన్ అయినా వారు లాభపడుతారని, తరువాత పెట్టుబడులు పెట్టిన వారు నష్టపోతారని తెలిపారు. ఇదే కాకా ఇంకో బిజినెస్ లో కొత్త చేరికలు గొలుసుకట్టులో గొలుసు పెరిగే కొద్దీ కమిషన్ కూడ పెరుగుతుందని, పెట్టిన డబ్బుకు 5 నుండి 10 రేట్లు వస్తాయని తప్పుడు వాగ్దానాలు చేసి నిందితులు ప్రజలను మభ్య పెట్టి ఈ యాప్ ల్లో జాయిన్ చేసినట్లు విచారణలో వెళ్లడైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలు ఎవరు కూడా ఆన్లైన్లో డబ్బులు పెట్టాలని ఎవరైనా సంప్రదిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, సైబర్వేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, క్రిప్టో, బిట్ కాయిన్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని సూచించారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఇలాంటి క్రిప్టో, బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టవద్దని, కుటుంబాలను రోడ్డుపాలు కావద్దని, ఈ తరహ వ్యాపారాలకు సంబంధించి వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆన్లైన్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ వ్యాపారాలకు ఏలాంటి గుర్తింపు లేదని, ప్రజలకు దురాశకు పోయి కష్టపడి సంపాదించిన డబ్బులను వృధా చేసుకోవద్దని సీఐ వేణుగోపాల్ సూచించారు.
Our Telangana Citizen Reporter.
Mr. Rakesh Gandhe.