జగిత్యాల జిల్లా: కేంద్రంలో జగిత్యాల – కరీంనగర్ రోడ్డు పై బైఠాయించి ANM లు ధర్నాకు దిగారు.ఎన్నో ఏళ్లుగా తాము చేస్తున్న సేవలు గుర్తించి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే తమను క్రమబద్ధీకరించలని డిమాండ్ చేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా సబ్ సెంటర్లు పెంచాలని కోరారు. అలాగే ఇప్పుడు కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ANM లకు వయో పరిమితి లేకుండా చూడాలన్నారు.ప్రభుత్వాలు మారుతున్న తమ ఇబ్బందులను ఎవరు పట్టించుకోవడం లేదని కనీసం ఇప్పటి రేవంత్ రెడ్డి సర్కారు అయినా గుర్తించి ANM ల ను ఆదుకోవాలి అన్నారు. ప్రభుత్వాలు తమ డిమాండ్లను ఒప్పుకోక పోతే త్వరలోనే మహా ధర్నాకు దిగుతామని, రాష్ట్రంలోని ANM లు అందరూ ఏకం అవుతారని హెచ్చరించారు.గంటల తరబడి జరిగిన మహా ధర్నాకు పోలీసులు కాపలాగా ఉండి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నారు మరియు చుట్టూ పక్కల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ట్రాఫిక్ ను దారి మళ్లించారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.