జగిత్యాల : జూలై 11ధర్మపురి పోలీసులు ఛేదించిన అంతర్రాష్ట్ర డ్రగ్ (గంజాయి) రాకెట్, ముగ్గురు నిందితులను 10.07.2024 రాత్రి సమయంలో అరెస్టు చేశారు, ఇందులో ఇద్దరు చిరువ్యాపారులు ఒకరు ఒడిశా రాష్ట్రానికి చెందినవారు మరియు మరొకరు AP రాష్ట్రానికి చెందినవారు, కొనుగోలుదారుడు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామం కి చెందినవాడు. జగిత్యాల జిల్లా గంజాయి తరలిస్తున్న ఇద్ధరు అంతర్ రాష్ట్ర నిందుతులు, స్థానికంగా కొనుగోలు చేసే వ్యాపారీ అరెస్ట్ చేశారు.నిందుతుల వద్ద నుoచి 6.03 కిలోల గంజాయి ,3 మొబైల్ ఫోన్స్ స్వాధీనం క్యాష్ 3500 సీజ్ చేశారు.అక్రమంగా గంజాయి సేవించిన,విక్రయించిన,కలిగి ఉన్న కఠిన చర్యలు తప్పవు అని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్. అన్నారు.జల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ.ఇటీవల, 04.07.2024 నాడు ధర్మపురి PS లో NDPS చట్టం కింద 1.బత్తిని చందు, 2. గొల్ల వెంకటేష్ మరియు 3.దుర్గం రాము s/o లచ్చయ్య, వయస్సు 23 సంవత్సరాలు, ధర్మపురి మండలానికి చెందిన r/o దొంతాపూర్ గ్రామం, వారి పై ధర్మపురి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబడింది. 03.07.2024న ఆ కేసు, 1. బత్తిని చందు, 2. గొల్ల వెంకటేష్లను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు పంపారు, అయితే దుర్గం రాములు పరారీలో ఉన్నాడు.నిందితుడు దుర్గం రాము ని పట్టుకునేందుకు యత్నిస్తుండగా, 10.07.2024 సాయంత్రం ధర్మపురి మండలం బుద్దేష్పల్లి గ్రామ బస్టాప్లో ఉన్న నిందితుడు దుర్గం రాము గురించి పి.ఉదయ్ కుమార్, ధర్మపురి ఎస్ఐకి సమాచారం అందింది. పై సమాచారం అందుకున్న SI ధర్మపురి మరియు సిబ్బంది చెప్పిన ప్రదేశానికి చేరుకున్నారు, అక్కడ SI ధర్మపురి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మరియు అరెస్టు చేసిన వ్యక్తుల వద్ద (6.030) కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.జిల్లాలో అక్రమ గంజాయి పై జిల్లా పోలీస్ ఉక్కుపాదం.సమాజంలో డ్రగ్స్పై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడo జరుగుతుంది. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీ (ఏడీసీ)లను ఏర్పాటు చేయడం జరుగుతుంది.. ఈ సమావేశంలో డిఎస్పి రఘు చందర్, సి.ఐ రామ్ నరసింహారెడ్డి రెడ్డి , ఎస్.ఐ లు ఉదయ్ కుమార్ ,సతీష్ , సిబ్బంది పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter
Sanjeev Bhandari.