జగిత్యాల జిల్లా: గౌరవ SP శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకుల కోసం మెగా జాబ్ మేళాను డిసెంబర్ 11 రోజున జగిత్యాల పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో 50 కి పైగా కంపెనీలు పదవ తరగతి నుంచి ఎంటెక్ విద్యార్హత కలిగిన వారెవరికైనా కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. పదవ తరగతి ఫెయిల్ అయిన వారికి కూడా తగిన ఉద్యోగాలు కల్పించబడతాయి. కావున బుగ్గారం మండలంలోని యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఆసక్తిగల యువతీ, యువకులు పైన ఇవ్వబడిన బార్ కోడ్ ను గూగుల్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి గూగుల్ ఫాం ని నింపి ఆన్లైన్లో అప్లై చేసుకోవలని తెలియజేశారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.